ఏప్రిల్ 21న బలభద్రపురం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన…

ఏప్రిల్ 21న బలభద్రపురం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన….

సీఎం ఏర్పాట్లు పరిశీలన

తూర్పుగోదావరి జిల్లా లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటీంచనున్నారని అందుకు సంబందించి అన్ని శాఖల అధికారులు సమన్వయము తో పనిచెయ్యాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు.

సోమవారం సాయంత్రం స్థానిక ఆదిత్య బిర్లా గ్రూప్ ఇండియా.. గ్రాసిమ్ ఇండస్ట్రీ ప్రైవేట్ కంపెనీ ఆవరణలో అధికారులతో సమావేశం నిర్వహించారు…జిల్లా కలెక్టర్ డా.కె.మాధవిలత, ఎస్పీ ఐశ్వర్య రాస్తోగి, శాసన సభ్యులు, కంపెనీ వైస్ చైర్మన్ మురళి కృష్ణన్, తదితరులతో కలిసి , ముందస్తు ఏర్పాట్లు పరిశీలన నిమిత్తం ఆదిత్య బిర్లా గ్రూప్ ఇండియా.. గ్రాసిమ్ ఇండస్ట్రీ ప్రైవేట్ కంపెనీ లో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.