కోడి పందేల్లో రూ. కోటిన్నర గెలిచాడు..

కోడి పందేల్లో రూ. కోటిన్నర గెలిచాడు..

సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలోని చాలా చోట్ల కోడి పందేలు జరుగుతున్నాయి. ప.గో జిల్లా తాడేపల్లిగూడెంలో ఓ వ్యక్తి కోడి పందేల్లో రూ. కోటిన్నర గెలిచాడు. పైబోయిన వెంకటరామయ్య బరిలో రాజమండ్రి రమేశ్, గుడివాడ ప్రభాకర్ కోళ్ల మధ్య పోటీ జరిగింది. ‘సేతువ’ కోడిపై రమేశ్కు చెందిన ‘డేగ’ కోడి నెగ్గడంతో అతడు రూ.1.53కోట్లు గెలుచుకున్నాడు. ఈ ఏడాది ప.గో జిల్లాలో ఇదే భారీ పందెం అని స్థానికులు చెబుతున్నారు…..
పండుగ వేళ.. తూర్పు గోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో బరుల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాలో గురువారం (జనవరి 15) ఓ బరిలో జరిగిన కోడి పందెంలో.. ఓ వ్యక్తి జాక్ పాట్ కొట్టేశాడు. పందెం గెలిచి ఏకంగా కోటిన్నరకు పైగా సొంతం చేసుకున్నాడు..

సంక్రాంతి సందర్భంగా తాడేపల్లిగూడెంలో కోడి పందేలు జోరుగా సాగాయి. రెండో రోజూ కూడా రూ. కోట్లలో డబ్బులు చేతులు మారాయి. ఈ క్రమంలో పైబోయిన వెంకటరామయ్య బరిలో.. గుడివాడ ప్రభాకర్‌, రాజమండ్రి రమేష్‌ కోళ్ల మధ్య భారీ పందెం జరిగింది. హోరాహోరీగా సాగిన ఈ పందెంలో రాజమండ్రి రమేష్‌ గెలుపొందాడు. దీంతో అతడు రూ. 1.53 కోట్లు బహుమతి సొంతం చేసుకున్నాడు. అయితే ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జరిగిన కోడి పందేల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఇదే అతిపెద్ద పందెం అని స్థానికులు అంటున్నారు.

కాగా, గోదావరి జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. పురుషులతో పాటు మహిళలు కూడా ఈ పందేల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. వీటిని తిలకించేందుకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి కోడి పందేలను కొన్ని చోట్ల వినూత్నంగా నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో కోడి పందేలను జూదంలా కాకుండా.. టోర్నమెంట్ లాగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959