ఏపీలో గడచిన 24 గంటల్లో, 8 పాజిటివ్ కేసులు నమోదు…

ఏపీలో గడచిన 24 గంటల్లో 8,017 కరోనా పరీక్షలు నిర్వహించగా, 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 2 కేసులు నమోదు కాగా, అనంతపురం జిల్లాలో 1, నెల్లూరు జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 1, విశాఖపట్నం జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 1, పశ్చిమ గోదావరి జిల్లాలో 1 కేసులు వెలుగు చూశాయి. అదే సమయంలో 45 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా కరోనా మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,19,532 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 23,04,551 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 251 మంది చికిత్స పొందుతున్నారు. ఏపీలో ఇప్పటిదాకా కరోనాతో 14,730 మంది మరణించారు.