ఏపీలో కరెంట్ ఛార్జీలు పెంచడంపై విపక్షాల నిరసనలు….
టీడీపీ, వామపక్షాలు, బీజేపీ విద్యుత్ ఛార్జీలపై పోరాటానికి దిగుతుండగా… ఇప్పుడు జనసేన పార్టీ కూడా ఇందులో చేరింది.. విద్యుత్ ఛార్జీలపై ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు....
ఏపీలో కరెంటు చార్జీల పెంపును నిరసిస్తూ ఉన్న..
ఏపీలో కరెంట్ ఛార్జీలు పెంచడంపై విపక్షాలు భగ్గుమన్నాయి…
టిడిపి..
విద్యుత్ ఛార్జీల బాదుడు పట్ల ప్రభుత్వంపై పోరాటం చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పార్టీ శ్రేణులతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మోటార్లకు మీటర్లు పెడుతూ రైతుల మెడకు ఉరితాడు బిగిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్రెడ్డి మాట ఇచ్చాడంటే.. దానికి రివర్స్ చేస్తాడని టీడీపీ నేత నారా లోకేష్ తప్పుబట్టారు…
జనసేన..
జనసేన అధినేత పవన్ కల్యాణ్..
అందులో భాగంగా.. రేపు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు జనసేన నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోందన్న ఆయన.. ఒక్కసారి పవర్ ఇవ్వండి నా పవర్ ఏంటో చూపిస్తా అంటూ విద్యుత్ ఛార్జీలను పెంచేసి వైసీపీ నాయకత్వం తన పవర్ ఈ విధంగా చూపించుకుంది అంటూ ఎద్దేవా చేశారు..
బిజేపీ.
విద్యుత్ ఛార్జీల పెంపుపై రాష్ట్ర భాజపా నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో సామాన్యులపై ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల భారం మోపిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పేర్కొన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించే వరకు ఉద్యమిస్తామని సోమువీర్రాజు హెచ్చరించారు….