ఏపీ లొ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల..

పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల….

పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి..

మే 2 నుంచి మే 13 వరకు పదో తరగతి పరీక్షలు

ఏప్రిల్ 8 నుంచి 28 వరకు ఇంటర్ పరీక్షలు

మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విడుదల చేశారు. గురువారం కర్నూలు నగర శివారు ప్రాంతంలోని ట్రిపుల్ ఐటి కళాశాల సెమినార్ హాల్లో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు… కేంద్రం జారీ చేసిన కోవిడ్-19 మార్గదర్శకాలను అనుసరించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు…