కొత్త గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణానికి ముహూర్తం ఖరారు..!

కృష్ణా.. ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. ఈ నెల 24వ తేదీన గవర్నర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు..

ఈ మేరకు కొత్త గవర్నర్‌ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు రేపు(బుధవారం) అబ్దుల్‌ నజీర్‌, ఏపీకి రానున్నారు. సతీసమేతంగా సాయంత్రం ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్ పోర్టుకి చేరుకుంటారు…