జగ్గంపేటలో జనసైనికులు అసమ్మతి సెగలు.!

తూర్పుగోదావరి జిల్లా

గోకవరం

జగ్గంపేటలో జనసైనికులు అసమ్మతి సెగలు.

రెండు రోజుల్లో అధిష్టానం నుండి ఏవిధమైన పిలుపు రాకపోతే జగ్గంపేటలో పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్న జనసేన కార్యకర్తలు.

జగ్గంపేట నియోజకవర్గంలో రోజురోజుకు మారుతున్న సమీకరణాలు.

అచ్యుతాపురంలో పవన్ కళ్యాణ్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్న జన సైనికులు.

తమ నాయకుడు పాఠంశెట్టి‌ సూర్యచంద్రను అభ్యర్థిగా ప్రకటించకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నామంటూ పవన్ కు అల్టిమేటం జారీ చేసిన ఆయన అనుచరులు.

సూర్యచంద్ర దీక్షకు దిగి రెండవ‌ రోజు గడుస్తున్నా‌ హైకమాండ్ స్పందించకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న జన‌ సైనికులు.

మరో నలభై ఎనిమిది గంటల్లో పార్టీ అధిష్టానం నుండి పాఠంశెట్టి సూర్యచంద్రపై పవన్ స్పందించక పోతే జగ్గంపేటలో జనసేన పార్టీకి రాజీనామా చేస్తామంటూ హెచ్చరిక.

మరోవైపు పవన్ కళ్యాణ్ నాకు దేవుడు… నేను పార్టీకోసమే అహర్నిశలు పనిచేసాను…

నేను ఆత్మహత్య చేసుకోను… కానీ అంతిమ ఆమరణ నిరాహారదీక్ష మాత్రమే చేస్తాను… పోలీసులు నాకు సహకరించాలంటు పాఠంశెట్టి సూర్యచంద్రం విన్నపం.

నా తుది శ్వాస విడిచేవరకు ఇక్కడే..దుర్గమ్మ సన్నిదిలోనే ఉంటా..పాటాంశెట్టి..

జగ్గంపేటలో జనసైనికులు అసమ్మతి రాగం అందుకున్నారు. అచ్యుతాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ తీరుపై జనసైనికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జగ్గంపేటకు తమ నాయకుడిని అభ్యర్థిగా ప్రకటించపోతే.. జగ్గంపేటలో జనసేన ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు జనసేన కార్యకర్తలు. కార్యకర్తల మనోభావాలను అధిష్టానం పట్టించుకోవడం లేదని.. జనసేన కార్యకర్త పాఠంశెట్టి సూర్యచంద్రం ఆవేదన వ్యక్తం చేశారు. మరో 48 గంటల్లో పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన రాకపోతే.. పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు..జగ్గంపేట సీటును ఆశించి జనసేన నేత పాఠంశెట్టి సూర్యచంద్ర భంగపాటుకు గురయ్యారు. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా జగ్గంపేట సీటును తెలుగుదేశం పార్టీ నేత జ్యోతుల నెహ్రూకు కేటాయించారు. దీంతో జనసేన నేత సూర్యచంద్ర తీవ్ర ఆవేదనకు గురయ్యారు. రోడ్డుపైనే బోరున విలపించారు. అనంతరం, ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. నిన్న రాత్రి అంతా అచ్చుతాపురంలోని అమ్మవారి ఆలయంలో దీక్షకు దిగారు..