ఏపీలో విషాదం..ఒకే కుటుంబంలో నలుగురు మృతి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా మాచర్ల నారాయణరెడ్డిపురం తండాలో ఈరోజు విషాదం నెలకొంది.

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. టీ”లో ఎలుకల మందు కలిపి ముగ్గురు పిల్లలు, భర్తకు ఇచ్చి భార్య తాగినట్లు గుర్తించారు.

సోమవారం ఇద్దరు కుమారులు మృతి చెందగా.. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఇవాళ చిన్నారి ఉమేష్‌ మృతి చెందాడు. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తల్లి వసంత మృతిచెందినట్టు తెలిసింది…