ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధం…

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు.. ఏపీ మంత్రులు వరుస పెట్టి కౌంటర్లు ఇచ్చారు.

మంత్రి హరీష్ రావు కామెంట్స్..

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గిందని మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు పేర్కొన్నారు. తాము తెగించి కొట్లాడాం కాబట్టే కేంద్ర ప్రభుత్వం ఈ
మేరకు ప్రకటన చేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బ అంటే అట్లా ఉంటుందని వ్యాఖ్యానించారు.

మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆది నుంచి పోరాడుతుంది తామేనని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇప్పుడు కొందరు తమవల్లే ఆగిందని చెప్పుకుంటుంటే ప్రజలు నవ్వుతున్నారని చెప్పారు. మంత్రి హరీష్‌రావు బాధ్యతగా మాట్లాడాలని సూచించారు. ఏపీలో జరుగుతున్న సంక్షేమం.. తెలంగాణలో ఎందుకు జరగడంలేదని ప్రశ్నిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ.

మంత్రి సిదిరి అప్ప‌ల‌రాజు కామెంట్స్..

ఎపి ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ మంత్రి సిదిరి అప్ప‌ల‌రాజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎపి సిఎంవో తీవ్రంగా స్పందించింది. ఎవరిపై అయినా కామెంట్స్ చేసేముందు జాగ్రత్తగా మాట్లాడాలని అమాత్యుడిని హెచ్చరించింది. నేతల స్థాయి ఏంటి, ఏం మాట్లాడుతున్నాం అనే దానిని దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలంటూ సీరియస్ అయ్యింది సీఎంఓ. ఇదే విషయాన్ని సీఎంవో వర్గాలు అనాధికారికంగా పేర్కొన్నాయి. మాటలు జాగ్రత్త అంటూ సిదిరికి క్లాస్ పీకింది.కాగా, బుధవారం నాడు శ్రీకాకుళం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేస్తే జాతీయ పార్టీ అయిపోతుందా? అని ప్రశ్నించారు. ఆ పార్టీకి ఏ కోశానైనా జాతీయ వాదం ఉందా? అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు అంతా ప్రాంతీయ వాదులు అని సీరియస్ కామెంట్స్ చేశారు. ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టి తెలంగాణకు నాయకులు అయ్యారని ఫైర్ అయ్యారు. ఏపీలో ప్రజాశాంతి పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి పెద్ద తేడా ఏమీ లేదని వ్యాఖ్యానించారు సీదిరి అప్పలరాజు. అంతేకాదు.. ఆంధ్రా ప్రజలు తెలంగాణకు రావడం మానేస్తే అడుక్కు తినడం తప్ప.. అక్కడ ఏమీ ఉండదని ఘాటైన వ్యాఖ్యలు చేశారు అప్పలరాజు. తెలంగాణ రాజకీయాలు ఏపీలో ఏమాత్రం పని చేయవని అన్నారు..

మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్.

ఇది ముమ్మాటికి బి ఆర్ యస్ విజయమే.

అందులోనూ ఆంద్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడానికే.

స్టీల్ ప్లాంట్ ప్రవేటీ కరణనను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటాం.

ఎపి మంత్రుల మాటలు అపరిపక్వతతో కూడినవి

విశాఖా స్టీల్ ప్లాంట్ ప్రవైటికరణలో కేంద్రం వెనక్కు తగ్గడం ముమ్మాటికి బి ఆర్ యస్ సాధించిన విజయంగా రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభివర్ణించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బకు దిగి వచ్చిన మోడీ సర్కార్ ఒకడుగు వెనెక్కి తగ్గిందన్నారు.తెలంగాణా రాష్ట్రం తరపున రాష్ట్ర ప్రభుత్వం బిడ్డింగ్ లో పాల్గొంటున్నందునే కేంద్రం ఈ నిర్ణయం టుకుందన్నారు.ఇందులో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసే మర్మం దాగి వుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆంద్రప్రదేశ్ లో జరగనున్న ఎన్నికల నేపద్యంలో అక్కడి ప్రజలను నమ్మించే ఎత్తుగడలలో ఇది భాగమై ఉండొచ్చు అన్నారు.ఎట్టి పరిస్థితి లోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవైట్ పరం కానివ్వబోమంటూ మంత్రి జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఏపీ మంత్రుల మాటలు అపరిపక్వతతో కూడినవంటూ ఆయన ఒక ప్రశ్నకు బదులుగా పేర్కొన్నారు.