ఆంధ్ర రాష్ట్రంలో మొదటి మొబైల్ సినిమా ధియేటర్!…

ఆడియెన్స్ కు ఫుల్ కిక్కు.. మొబైల్ సినిమా థియేటర్ రెడీ.. మెగాస్టార్ చిరుతోనే ప్రారంభం....

ఇది ట్రక్కులో ఎక్కడికైనా తీసుకుపోయి అమర్చుకోగల మొబైల్ సినిమా హాల్ . రాజానగరం వద్ద నేషనల్ హైవే పక్కన హాబిటేట్ ఫుడ్ కోర్టు ప్రాంగణంలో ఈ ధియేటర్ ఏర్పాటౌతోంది. వెదర్ ప్రూఫ్, ఫైర్ ఫ్రూఫ్ పద్ధతుల్లో వేసిన టెంట్ లో గాలినింపే టెక్నాలజీతో 120 సీట్ల కెపాసిటీతో ఈ ఎసి ధియేటర్ ను రూపొందిస్తున్నారు.

“పిక్చర్ డిజిటల్స్” సంస్ధ ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పుతున్న మొబైల్ ధియేటర్లలో ఇది మొదటిదని,ఆచార్య సినిమాతో ధియేటర్ ప్రారంభం కాగలదని సంస్ధ ప్రతినిధి చెప్పారు.

ఆచార్య సినిమాతో ఈ హాల్ ప్రారంభమౌతుందని ఆన్నారు.

ఇది ఒకప్పటి టూరింగ్ టాకీసులకు ఆధునికమైన, సౌకర్యవంతమైన రూపం…..
దేశంలో మొట్టమొదట 1930లో ‘కోహినూర్ ఒపేరా’ పేరుతో అస్సాం రాష్ట్రంలో మొబైల్ థియేటర్ ను ప్రారంభించారు. దీనిని నాట్యాచార్య బ్రజనాథ్ శర్మ 90 ఏండ్ల కిందనే స్థాపించారు. అయితే ఈ థియేటర్ ద్వారా కోహినూర్ ఒపేరా ధుబ్రీ నుండి సదియా వరకు వేలాది మంది ప్రేక్షకులను ఆకర్షించి నాటకాలను ప్రదర్శించారు. మొదటి మొబైల్ థియేటర్ నాటకం 2 అక్టోబర్ 1963న ఆ రాష్ట్రంలోని ఓ పాఠశాలలో ప్రదర్శించారు. ప్రస్తుతం 150 నుంచి 160 వరకు మొబైల్ థియేటర్లు రన్ అవుతున్నట్టు సమాచారం. ..