ఏపీ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారం అప్పులు చేస్తోందు.. ఉండవల్లి

*రాజమండ్రి
R9TELUGUNEWS.com
వైఎస్ జగన్ సర్కార్‌పై మాజీ ఎంపీ, సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు..

శనివారం నాడు రాజమహేంద్రిలో మీడియా మీట్ నిర్వహించిన ఆయన..ఏపీ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారం అప్పులు చేస్తోందని ఉండవల్లి ఆరోపించారు. జగన్‌ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.6 లక్షల కోట్ల అప్పు చేసిందని.. అమరావతిని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారని ఆయన అన్నారు. ఎంతో మంది సలహాదారులు ఉన్న ఈ ప్రభుత్వం ఆర్థిక దయనీయ పరిస్థితులు ఉండటం దారుణమన్నారు. ఇంత జరుగుతున్నా అసలు ప్రభుత్వ సలహాదారులు ఏం చేస్తున్నారు? అని మాజీ ఎంపీ ప్రశ్నించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏపీకి గడ్డు పరిస్థితి తప్పదని ఉండవల్లి హెచ్చరించారు. ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారిపోయిందని ఆయన అన్నారు.