ఉద్యోగుల సమ్మె..సీఎం జగన్ కీలక సమావేశం..

అమరావతి :
R9TELUGUNEWS.COM.
ఉద్యోగులు సమ్మెకి సిద్ధమవుతున్నారు.ఈనెల 6వ తేదీ అర్థరాత్రి నుంచి సమ్మెబాట పట్టనున్నారు.

ఈనేపథ్యంలో ఏం చేయాలనే దానిపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు.

మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి,బొత్స సత్యనారాయణ,ప్రభుత్వసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి,సీఎస్ సమీర్ శర్మ సమావేశంలో పాల్గొన్నారు.

ఆదివారం(ఫిబ్రవరి 6) అర్థరాత్రి నుంచి ఉద్యోగులు సమ్మెకు వెళ్లనున్న నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై ఈ కీలక సమావేశంలో చర్చిస్తున్నారు.

ఉద్యోగుల పెన్ డౌన్, యాప్స్ డౌన్, ఉద్యోగ సంఘాల డిమాండ్ల అంశంపైనా మంత్రులతో చర్చిస్తున్నారు సీఎం జగన్.

పీఆర్సీ సహా హెచ్ఆర్ఎ, ఇతర డిమాండ్లపైనా డిస్కస్ చేస్తున్నారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్తే తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో సీఎం జగన్ నిర్ణయం తీసుకోనున్నారు.

పాలన స్తంభించకుండా తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సీఎం జగన్ సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.