ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌..

ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌
శాసన సభ నుంచి టీడీపీ సభ్యులను సస్పెన్షన్‌ చేశారు. సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించడంతో ఒక రోజు పాటు 11 మంది టీడీపీ సభ్యులను సస్పెన్షన్‌ చేస్తూ స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నారు. సత్యప్రసాద్‌, చినరాజప్ప, రామ్మోహన్‌, అశోక్‌, సాంబశివరావు, గొట్టిపాటి రవి, రామరాజు, గణబాబు, భవానీ, జోగేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణలను సస్పెన్షన్‌ చేశారు….తాజాగా 11 మంది సభ్యులను ఇవాళ ఒక్క రోజే సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. అంతకుముందు సీఎం జగన్ మాట్లాడుతూ.. టీడీపీ సభ్యుల తీరుపై మండిపడ్డారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హితవు పలికారు. మంగళవారం ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ, 55వేల జనాభా ఉన్న చోట ఎవరైనా సారా కాస్తారా? నిఘా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో సారా తయారీ సాధ్యమా అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే నమ్మే విధంగా ఉండాలన్నారు.