ఏప్రిల్ 11న ఏపీ మంత్రి వర్గ విస్తరణ..!!

మంత్రివర్గంలో ఉండేదెవరు.. పదవిని కోల్పోయేదవరనే దానిపై అందరి దృష్టి నెలకొంది. పనితీరు, సమర్ధత, సామాజిక వర్గాలు, జిల్లాల సమీకరణాలు, ఇతర అంశాలపై ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన వైఎస్ఆర్సీఎల్పీ సమావేశంలో కేబినెట్ మార్పులపై సీఎం జగన్ (CM YS Jagan) కామెంట్స్ చేయడంతో ఏ క్షణంలోనైనా కేబినెట్లో మార్పులు జరుగుతాయన్న ప్రచారం జరిగింది. తాజాగా మంత్రివర్గంలో మార్పులకు సంబంధించి మరో వార్త హల్ చల్ చేస్తోంది…రెండున్నరేళ్లు ముగిసిన తర్వాత కరోనా ..
ఇతర కారణాల వల్ల మంత్రివర్గ విస్తరణ చేయలేకపోయారు. ఇప్పుడు ఆ పని కూడా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. కొత్తగా మంత్రులయ్యేవారు కుదురుకుని ఎన్నికల సమయానికి పట్టు సాధిస్తే..విజయం సులువు అవుతుందని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు..

ఏప్రిల్ 11న ఏపీ మంత్రి వర్గ విస్తరణ..

ఏపీలో మంత్రి వర్గ విస్తరణపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 8వ తేదీన గవర్నర్ బిశ్వభూషణ్ తో సీఎం జగన్ భేటీ అవ్వనున్నారు. మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణపై గవర్నర్ కు వివరించనున్నారు. ఏప్రిల్ 11వ తేదీన ఏపీ కొత్త కేబినేట్ కొలువుదీరనుంది. ఒక రోజు ముందుగానే కొత్త మంత్రులకు సమాచారం అందస్తారని..