ఆలయాల దాడుల ఘటనల్లో 17 మంది టీడీపీ, నలుగురు బీజేపీ నేతలు..డీజీపీ సవాంగ్‌..

ఆంధ్రప్రదేశ్..

*ఆలయాల దాడుల ఘటనల్లో 17 మంది టీడీపీ, నలుగురు బీజేపీ నేతలు*

ఆలయాలపై దాడుల ఘటనల్లో రాజకీయ నేతల ప్రమేయం ఉందని ఏపీ డీజీపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 17 మంది టీడీపీ నేతలు, నలుగురు బీజేపీ నేతల హస్తం ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే 13 మంది టీడీపీ నేతలు, ఇద్దరు బీజేపీ నేతల అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు డీజీపీ సవాంగ్‌. ఏపీలో మతవిద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తీసుకుంటామని.. ఆలయాలపై దాడుల్ని రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. మతాల మధ్య వైషమ్యాలు సృష్టించేవారిపై కఠినంగా ఉంటామని పేర్కొన్నారు డీజీపీ సవాంగ్‌. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్చలు తప్పవని హెచ్చరించారు. ఆలయాల దాడులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఆలయాలపై దాడుల విషయంలో దుష్ర్పచారం చేస్తున్నారని తెలిపారు.