మంత్రి పదవులు ఆశించి రాకపోవడంతో భగ్గుమన్న విభేదాలు.. తీవ్ర అసంతృప్తి లో వైఎస్సార్ సీపీ శ్రేణులు…

కొత్త కేబినెట్లో చోటు దక్కకపోవడంతో పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర నిరాశకు గురయ్యారు. మంత్రిపదవి దక్కని వారిలో పలువురు.. వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తుండగా.. వారి అనుచరులు ప్రత్యక్ష ఆందోళనకు దిగుతున్నారు…

ఒంగోలులో బాలినేని అనుచరులు తీవ్ర అసంతృప్తి….సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బాలినేని అభిమానులు..

నూతన మంత్రివర్గ కూర్పులో బాలినేని కి దక్కని చోటు..

ఒంగోలులో మంగమురు రోడ్డు జంక్షన్ లో బాలినేని అభిమానులు ఆందోళన…

బాలినేని శ్రీనివాసరెడ్డి నూతన మంత్రి వర్గంలోకి తీసుకోవాలని డిమాండ్..

సీఎం జగన్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బాలినేని అభిమానులు

ఒంగోలు వైసిపి కార్యాలయం దగ్గరికి భారీగా చేరుకుంటున్న బాలినేని అభిమానులు

సిఎం..డౌన్..డౌన్ అంటూ నినాదాలు….
******************

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట…

జగ్గయ్యపేట నియోజకవర్గంలో అసమ్మతి తో భగభగమంటున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు

నూతన మంత్రివర్గంలో జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను కు చోటుదక్కనందుకు జగ్గయ్యపేట వైసిపి కార్యకర్తలు భగ్గుమన్నారు.

ఎమ్మెల్యే ఇంటి సమీపంలో ఒకరు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య పాల్పడ్డారు తోటి కార్యకర్తలు ఆయనను నివారించి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు…

పలువురు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు…

జాతీయ రహదారి 65 మీద ముండ్లపాడు క్రాస్ రోడ్ లో రాస్తారోకో నిర్వహిస్తూ టైర్లు తగుల బెట్టి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉదయభాను నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు..
********************
తీవ్ర మనస్తాపంతో రాజీనామా ఆలోచనలో మేకతోటి…!!!

ఎస్సీ మినిస్టర్స్ అందరినీ కొనసాగిస్తూ నన్ను తప్పించడానికి నేను చేసిన తప్పు ఏమిటి?
స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాకు సిద్ధపడిన మేకతోటి..

ఎస్సీ మంత్రులను అందరినీ కొనసాగిస్తూ తనను తప్పించడంతో నేను చేసిన తప్పు ఏమిటి అని తీవ్రమనస్తాపానికి గురైన సుచరిత..
రెండురోజులుగా కుటుంబ సభ్యులు కలవడానికి ప్రయత్నించినా అవకాశం ఇవ్వని సజ్జల.
సుచరిత ఇంటికి చేరుకుంటున్న అభిమానులు, దళిత సంఘాల నాయకులు కాసేపట్లో మీడియా ముందుకు రానున్న సుచరిత….
***************

మాచర్ల నియోజకవర్గంలో అసంతృప్తి సెగ ఒక్కసారిగా విరుకుపడింది. కొత్త కేబినెట్ పై ఆశలు అడియాశలు కావడంతో నేతల్లో ఆవేదన భగ్గుమంది. దీంతో అనుచరులు ఆందోళనకు దిగుతున్నారు. తమ న్యాయకుడికి న్యాయం జరగాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అనుచరులు మాచర్ల పట్టణంలో రోడ్లపైకి వచ్చారు. తమ నాయకుడికి మంత్రి పదవి దక్కడం లేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. రింగురోడ్డు సెంటర్ లో టైర్లు, బైక్ దగ్ధం చేసి ఆందోళన వ్యక్తం చేశారు. కాగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కొత్త కేబినెట్ లిస్టులో పేరు లేదని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన వర్గం ఆగ్రహంతో ఊగిపోతోంది. పిన్నెల్లికి మంత్రి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. మాచర్లలో దుకాణాలు బంద్ చేసి ధర్నా చేపట్టింది.
*****”””””*********.

కేబినెట్ పదవులు వైసీపీ ఆశావహుల్లో భావోద్వేగాన్ని కలిగిస్తున్నాయి. కొత్త కేబినేట్‎లో పదవి దక్కుతుందని గంపెడు ఆశలు పెట్టుకున్న నేతలకు మంత్రుల లిస్టు కన్నీటిని తెప్పిస్తోంది. తమకు పదవి రాకుండా పోతోందనే ఆవేదన కళ్ల నుంచి నీటి రూపంలో ఒక్కసారిగా బయటకు వస్తోంది. పండగ పూట నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. లిస్టులో తన పేరు లేదని భావోద్వేగం వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి దక్కడంలేదని వాపోయారు. అయినా సీఎం జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. పార్టీ గెలుపు కోసం కృష్టి చేస్తానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.
*******************

విజయవాడ బందరు రోడ్డులో వైకాపా శ్రేణులు కొలుసు పార్థసారధి వ‌ర్గీయుల ఆందోళన చేపట్టారు. ఈ మేరకు విజయవాడలోని పార్టీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. కొలుసు పార్థసారధికి మంత్రి ప‌ద‌వి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పెన‌మ‌లూరు నుంచి వైకాపా నేతలు, కార్యకర్తలు భారీగా త‌ర‌లివ‌చ్చారు…
*****************