ప్రత్యర్దులని సూటిగా, సున్నితంగా, ఘాటుగా.. ఎలాగైనా విమర్శించటంలో నాగబాబు దిట్ట. మొదట్లో మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసేవాళ్ళకి కౌంటర్ ఇస్తూ మొదలైన తన విమర్శల పర్వం.. నేడు తమ్ముడు పవన్ కళ్యాణ్ కి అనుకూలమయ్యే రాజకీయ అంశాలపై కూడా కొనసాగిస్తున్నాడు. అయితే మొన్నామధ్య నాగబాబు కుమార్తె నిహారిక పబ్ కేసులో పట్టుబడ్డాకా.. కాస్త సైలెంట్ అయిన నాగబాబు తనలోని విమర్శకుడికి మరోసారి పనిచెప్పాడు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ తాజాగా కొలువుదీరగా.. 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ ఆధ్వర్యంలో జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ కొత్త కేబినెట్ ఏర్పాటు పై నాగబాబు సెటైర్స్ వేశారు. మంత్రి పదవులు ఆశించి రాని వాళ్లు, మంత్రులుగా పనిచేసి ఇప్పుడు మాజీలు అయిన వాళ్లంతా ఆవేదన చెందడం, కన్నీరుపెట్టుకోవడం, ఫ్రస్టేషన్‌కి గురైన వీడియోలు నేడు సోషల్ మీడియాలో ప్రధానంగా హైలైట్ అవ్వగా.. వాటిపై స్పందించాడు నాగబాబు…ఎంత దు:ఖాన్ని దిగమింగుకున్నా కానీ కొంత మంది నేతలు అక్కడక్కడ బరెస్ట్ అయ్యారు. గుక్కపెట్టి ఏడ్చేశారు. ఇలా వైసీపీ ఎమ్మెల్యేలు ఏడవడం పట్ల జనసేన ముఖ్యనేత, సినీ నటుడు కొణిదెల నాగబాబు మాట్లాడుతూ.. పదవుల కోసం బాధపడిన నేతలంతా ప్రజల సమస్యలపైన పశ్చాత్తాపం చూపించి ఉంటే బాగుండేదని.. వైసీపీ మాజీ మంత్రులను ఓదార్చుతూనే గిల్లారు నాగబాబు. వైసీపీలో మంత్రి పదవులు రాని వారు, మంత్రి పదవులు పోయిన వారి బాధ, కుమిలి పోవడం కొంతమంది కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తే తనకు బాదేస్తుందని… అయ్యో పాపం అనిపించింది అని కామెంట్ చేశారు. ఇక మీరు ఫీలవడం వల్ల ఎవరికి ఉపయోగం అని తన మనసులో మాటను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నిజంగా పదవుల కోసం కన్నీరు కార్చిన వాళ్లంతా కౌలు రైతుల ఆత్మహత్యలు, చేతి వృత్తుల వాళ్లు చనిపోతే..లేదంటే ఉద్యోగాలు రాని యువత కోసమే బాధపడి ఉంటే బాగుండేదన్నారు నాగబాబు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.