ఏపీలో బిఇడి కోర్సులో ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేష్ విడుదల..!

ఏపీలో బిఇడి కోర్సులో ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేష్ విడుదలైంది. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ ఏడాది జులై 13న బిఇడి ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్‌ బిఇడి కోర్సుల అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగే పరీక్షలకు ప్రొఫెసర్ అమృతవల్లి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. 2022-23 సంవత్సరంలో రెండేళ్ల బిఇడి కోర్సుతో పాటు స్పెషల్ బిఇడి కోర్సులలో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. బిఇడి కోర్సులలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ప్రవేశపరీక్ష కోసం ఓసీ అభ్యర్ధులు రూ.650, బిసి అభ్యర్ధులు రూ.500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు రూ.450 ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. బిఇడి కోర్సుల్లో ప్రవేశానికి అర్హతలు, ప్రవేశ పరీక్ష సిలబస్‌, ఇతర వివరాలు ఆన్‌లైన్‌లో లభిస్తాయి. మే 9 నుంచి దరఖాస్తుల స్వీకరిస్తున్నారు. జూన్‌ 7లోపు ప్రవేశపరీక్షకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని కన్వీనర్ సూచించారు. https;//cets.apshe.ap.gov.in ద్వారా ఎంట్రన్స్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.