ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో సంచలన నిర్ణయం ప్రకటించేందుకు సిద్దమవుతున్నారు. ముందస్తు ఎన్నికల ప్రచారం వేళ.. ప్రతిపక్షాలపైన ఒత్తిడి పెంచుతూ తాను ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నానో చాటి చెప్పేలా డేరింగ్ డెసిషన్ దిశగా సిద్దమయ్యారు. పార్టీ ప్లీనరీ వేదికగా ఈ ప్రకటనకు రంగం సిద్దమవుతోంది. వచ్చే ఎన్నికల కోసం ఈ ఏడాది ఉగాది నుంచే సీఎం జగన్ అడుగులు మొదలు పెట్టారు. కొత్త జిల్లాల ఏర్పాటు..మంత్రి వర్గ విస్తరణ..పార్టీ పదవులు ఖరారు చేసారు. ఇంటింటికి ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యేలను ప్రజల్లోకి పంపారు.మళ్లీ అధికారమే లక్ష్యంగా ముందుకు ఇక, ప్రతిపక్షాలు టార్గెట్ జగన్ సింగిల్ పాయింట్ అజెండాతో ఎన్నికలకు.. కొత్త పాత్తులకు సిద్దం అవుతున్నారు. ఇప్పుడు ఏం జరిగినా..ఎన్నికల సమయానికి జగన్ ను ఓడించాలనే ఏకైక లక్ష్యంగా టీడీపీ – జనసేన ఏకం అవుతాయని వైసీపీ విశ్వసిస్తోంది. అందుకు అనుగుణంగానే తాము ఎన్నికలకు సిద్దమని చెబుతునే..అంతటితో ఆగటం లేదు.ఏకంగా అభ్యర్ధులను సైతం ప్రకటించి..ప్రతిపక్షాల పైన ఒత్తిడి పెంచే వ్యూహం అమలు చేస్తోంది. 2019 ఎన్నికల సమయంలో..ఒకే సారి ఎంపీలు – ఎమ్మెల్యేల జాబితాను సీఎం జగన్ ఇడుపుల పాయ వేదికగా ప్రకటించారు. ఇప్పుడు సిట్టింగి ఎమ్మెల్యే పని తీరు పలు కోణాల్లో నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ప్రజలు..పార్టీ పట్ల వారి పని తీరు.. వచ్చిన నివేదికల ఆధారంగా మార్కులు కేటాయిస్తున్నారు.ప్లీనరీ వేదికగా సంచలన ప్రకటనలు వీటిని పరిగణలోకి తీసుకొని టిక్కెట్ల ఖరారుకు తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక, ప్లీనరీ వేదికగా సీఎం జగన్ తాను ఎన్నికలకు ఆరు నెలల నుంచి 10 నెలల ముందే అభ్యర్ధులను ప్రకటించే అంశం పైన ప్రకటనకు సిద్దం అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీని ద్వారా.. అభ్యర్ధులను ఇప్పటి నుంచే ప్రజలకు దగ్గర చేసి..వారితో ఎన్నికల సమయానికి పూర్తిగా మమేకం అయ్యేలా చూడాలని..జగన్ కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు.దీని ద్వారా పొత్తుల కోసం ప్రయత్నాలు చేసుకుంటున్న ప్రతిపక్ష పార్టీల పైన టిక్కెట్ల ఒత్తిడి పెరగటం తో పాటుగా టిక్కెట్లు ఎవరికి ఇచ్చేది తేల్చేయటం ద్వారా పోటీలో ఉండే అభ్యర్ధులకు ప్రచారానికి.. ప్రజలతో దగ్గరవ్వటానికి సమయం దొరుకుతుందని విశ్లేషిస్తున్నారు. ఇక, టిక్కెట్లు ఈ సారి ఇవ్వలేక పోయే వారికి సైతం క్లారిటీ ముందుగానే ఇవ్వనున్నారు..ప్రతిపక్షాలకు సవాల్ ఎన్నికలకు రెడీ వారి సేవలు ఎన్నికల వేళ పార్టీకి వినియోగించుకోవటం..పార్టీ అధికారంలోకి వస్తే వారికి కీలక బాధ్యతలు ఇచ్చేలా ముందస్తు హామీ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇక,ప్లీనరీ వేదికగా వచ్చే ఎన్నికల పైన కీలక ప్రకటనతో పాటుగా.. 2019 ఎన్నికల హామీలు…2024 లో చేయబోయే కార్యక్రమాల పైన ముందుగానే స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.కానీ, ఇదే సమయంలో ఇంత ముందుగానే అభ్యర్ధులను ప్రకటించటం ద్వారా ప్రతిపక్షాలకు అభ్యర్ధుల ఎంపికలో సమయం తో పాటుగా.. వారికి ఇతర కోణాల్లో అవకాశం ఇచ్చినట్లవుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుంటే మినహా.. ప్లీనరీ వేదికగా ఎన్నికలు – అభ్యర్ధుల విషయంలో సంచలన నిర్ణయం ప్రకటించేందుకు సీఎం జగన్ సిద్దమవుతున్నారని విశ్వసనీయ సమాచారం. దీంతో..జగన్ ప్రకటనలో ఏఏ అంశాలు ఉంటాయి.. ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఆసక్తి పార్టీలో..ప్రధానంగా ఎమ్మెల్యేలో కనిపిస్తోంది…!!
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.