ఏపీలో తీవ్ర వడగాల్పుల అలెర్ట్. రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు తీవ్ర వడగాల్పుల హెచ్చరిక. రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం..
పార్వతీపురంమన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాలు, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, కాకినాడ జిల్లా జగ్గంపేట, తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ , ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో తీవ్ర వడగాల్పులు (09) ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
Ap Heatwave Alert : రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు (32): విజయనగరం 4, పార్వతీపురం మన్యం 3, పోలవరం 3, కాకినాడ 1, తూర్పుగోదావరి 2, ఏలూరు 4, కృష్ణా 2, ఎన్టీఆర్ 7, గుంటూరు 1, పల్నాడు జిల్లాల్లోని 5 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. శనివారం 90 మండలాల్లో
వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
Ap Heatwave Alert : గురువారం కడప(జి) కమలాపురంలో 40.7°C, అనంతపురం(జి) తెరన్నపల్లి 40.6°C, కృష్ణా(జి) పెద్దపారుపూడి 40.5°C, నంద్యాల(జి) కొత్తపల్లె 40.4°C, కర్నూలు(జి) బస్తిపాడులో40.3°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.
Ap Heatwave Alert : ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని ప్రఖర్ జైన్ సూచించారు. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. చెవుల్లోకి వేడి గాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలన్నారు..