మాపై బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభావమేమీ ఉండదు…మంత్రి బొత్స సత్యనారాయణ…

*అమరావతి.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస)ని భారత్‌ రాష్ట్ర సమితి(భారాస)గా మార్చుకోవం వాళ్లిష్టమని చెప్పారు. ‘‘ఏపీలో ఉన్న పార్టీల్లో బీఆర్‌ఎస్‌ ఒకటవుతుంది అంతే. ఎంతమంది పోటీలో ఉంటే అంత మంచిది. మాపై బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభావమేమీ ఉండదు’’ అని బొత్స వ్యాఖ్యానించారు.