ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పోసాని మురళీకృష్ణని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం..

ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పోసాని మురళీకృష్ణని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం.
ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని నమ్ముకున్న మరో సినీ నటుడు పోసాని కృష్ణమురళికీ న్యాయం చేశారు. ఇటీవలే ప్రముఖ సినీ హస్య నటుడు ఆలీకి ప్రభుత్వ సలహదారు (ఎలక్ట్రానిక్ మీడియా) పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సినీనటుడు పోసాని కృష్ణమురళికి ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించారు సీఎం వైఎస్ జగన్. ఏపి ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా పోసాని కృష్ణమురళి నియమితులైయ్యారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోసాని నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది…