ఏపీ కేబినేట్ భేటీలో కీలక నిర్ణయాలు…

ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన నేడు జరిగిన ఏపీ కేబినేట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ ప్రాజెక్టులో మొదటి విడతలో 55 వేల కోట్లు, రెండో విడతలో 55 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తుంది. ఇక న్యూ ఎనర్జీ పార్క్ తో పాటు కర్నూల్, అనంతపురం, నంద్యాల, సత్యసాయి జిల్లాలో విండ్ అండ్ సోలార్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కూడా కేబినేట్ ఆమోదం తెలిపింది. వైజాగ్ టెక్ పార్క్ కు 60 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది..