గంజాయి కలకలంపై స్పందించిన సీఐ, ఎస్సై….

ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో శుక్రవారం గంజాయి కలకలం రేపింది. సోషల్ మీడియా మాధ్యమాలలో గంజాయి విక్రయిస్తున్నారని గంజాయిని సిగరెట్లలో పెట్టుకొని యువకులు మైనర్లు తాగుతున్నారని విస్తృతంగా వైరల్ అయింది.అంతేకాకుండా గంజాయి సిగరెట్లు వెలుగు చూశాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు గంజాయి మూలాలపై విచారణ చేపట్టారు. కంభం సర్కిల్ సీఐ రాజేష్ కుమార్ మాట్లాడుతూ గంజాయి అంశంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని అన్నారు. తమ పిల్లల పట్ల తల్లితండ్రులు జాగ్రత్త వహిస్తూ వారు ఏమి చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు. ఎటువంటి అలవాటు కలిగి ఉన్నారని ఎప్పటికప్పుడు వారిని గమనిస్తూ ఉండాలని సీఐ. రాజేష్ కుమార్ అన్నారు.