బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ ఫిర్యాదులపై స్వీకరించండి: ఎస్‌ఈసీ

అలాంటి ఫిర్యాదులు స్వీకరించండి: ఎస్‌ఈసీ

మున్సిపల్‌ ఎన్నికల్లో బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) స్పష్టత ఇచ్చింది. ఈ తరహా ఫిర్యాదులు స్వీకరించాలని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారుల(ఆర్వో)కు ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్ల ఉపసంహరణ కోసం నిర్దేశించిన మార్చి 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు దీనిపై వివరాలు పంపాలని సూచించింది. అసహజ రీతిలో నామినేషన్ల ఉపసంహరణ జరిగి ఉంటే అలాంటి పరిస్థితులపై ఫిర్యాదులు స్వీకరించి వాటిని ఎస్‌ఈసీకి నివేదించాలని ఆర్వోలను ఆదేశించింది. ఎక్కడైనా బలవంతపు ఉపసంహరణలు జరిగితే వాటిని పునఃపరిశీలించి పునరుద్ధరిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.