ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. మొత్తం 63 అంశాలకు ఆమోదముద్ర….

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు..
మొత్తం 63 అంశాలకు ఆమోదముద్ర

*అమరావతి ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశంలో నేడు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(ap cm ys jaganmohan reddy) అధ్యక్షతన ఈ భేటీ జరిగింది..

మొత్తం 63 అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అందులో 12వ పీఆర్సీ నియామకానికి.. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్‌ అమలుపైనా కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది.

కాంట్రాక్ట్‌ ఉద్యోగుల(contract employees) క్రమబద్ధీకరణకు,

ఈ ఏడాది అమ్మ ఒడి(ammavadi) పథకం అమలుకు,

ఈ ఏడాది విద్యాకానుక పంపిణీకి,

జగనన్న ఆణిముత్యాలు పథకం అమలు.. ఇంకా పలు కీలక నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

గ్లోబల్‌(global) ఇన్వెస్టర్‌ సమ్మిట్‌లో ఎంవోయూలు చేసుకున్న పలు సంస్థలకు భూ కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.