కుప్పంలో టీడీపీకి భారీ షాక్…

ఏపి పంచాయతీ మూడో దశ ఎన్నికల్లో అధికార వైసీపీ బలపరిచిన అభ్యర్థులు భారీ విజయాలు నమోదు చేసుకున్నారు. పల్నాడు ప్రాంతంలో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేశారు. ఇక ఇదిలా ఉంటె, చిత్తూరు జిల్లాలోనూ వైసీపీ బలపరిచిన అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు. ఇకపోతే, చంద్రబాబు సొంత నియోజక వర్గం కుప్పంలో టీడీపీకి షాక్ తగిలింది. కుప్పం నియోజక వర్గంలో మొత్తం 89 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగ్గా, 74 చోట్ల వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ 14 చోట్ల, కాంగ్రెస్ ఒకచోట విజయం సాధించింది. ఇక చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మొత్తం 264 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా ఏకగ్రీవాలు 91, వైసీపీ 145, టీడీపీ 28, కాంగ్రెస్ ఒకచోట విజయం సాధించింది.