జగ్గంపేట తాసిల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు….

*జగ్గంపేట తాసిల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు.

*కాకినాడ జిల్లా.. లంచం తీసుకుంటుండగా పట్టుబడిన డిప్యూటీ తాసిల్దార్ కే. శ్రీనివాస్.

కాకినాడ జిల్లా జగ్గంపేట తాసిల్దార్ కార్యాలయంలో టేకు చెట్లు NOC పర్మిషన్ నిమిత్తం రవి అనే వ్యక్తి పర్మిషన్ నిమిత్తం దరఖాస్తు చేసుకున్నాడు.

పర్మిషన్ ఇచ్చేందుకు డిప్యూటీ తాసిల్దార్ కే.శ్రీనివాస్ 16 వేల రూపాయలు లంచం అడిగాడు.

16 వేల రూపాయలు ఇవ్వలేనని 10 వేలకు ఒప్పందం కుదిరింది.

ముందుగా మూడు వేల రూపాయలు ఇచ్చి మిగతా ఏడు వేల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా. తరచుగా ఇబ్బంది పెట్టడంతో రవి అనే వ్యక్తి స్పందనను ఆశ్రయించాడు.

ఈ మేరకు రాజమండ్రి ఎడిషనల్ ఎస్పీ Ch. సౌజన్య ఆధ్వర్యంలో, ACB CI వి. పుల్లారావు, డి. వాసు కృష్ణ, బి. శ్రీనివాస్, వై. సతీష్ ల సిబ్బందితో కలిసి సుమారు సాయంత్రం 6.30 నిముషాలకు దాడులు నిర్వహించి లంచం తీసుకుంటున్న డిప్యూటీ తాసిల్దార్ కె శ్రీనివాసులును పట్టుకున్నారు.

దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపడతామని రాజమండ్రి ఎడిషనల్ ఎస్పీ, సి హెచ్. సౌజన్య తెలిపారు.