సినీ నటుడు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు ఆలీ సంచలన ప్రకటన..!!

సినీ నటుడు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు ఆలీ సంచలన ప్రకటన చేశారు.

జగన్ ఆదేశిస్తే తాను పవన్ కల్యాణ్ పై పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు.

పవన్ ఎక్కడి నుంచి పోటీ చేసినా తాను అక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమన్నారు.

పవన్ తనకు సినిమాల పరంగా మిత్రుడేనని అన్నారు. మంచి మిత్రుడైనా రాజకీయాల్లో ఇద్దరం వేరని అన్నారు.

సినిమాలు వేరు, రాజకీయాలు వేరని ఆలీ అభిప్రాయపడ్డారు.

2024 ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాల్లో గెలుపొందడం ఖాయమని ఆలీ జోస్యం చెప్పారు.

వైసీీపీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులే పార్టీని అన్ని నియోజకవర్గాల్లో గెలిపిస్తాయని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గెలుపుకు బాట వేస్తాయని ఆలీ తెలిపారు.