నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీ..!

*నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీ.*

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఖరీఫ్-2023 కరవు సాయం, మిచౌంగ్ తుఫాను పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) నేటి నుంచి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. 11.57 లక్షల మందికి రూ.1,289 కోట్లు అందించనుంది. ఖరీఫ్ రైతులకు రూ.847 కోట్లు, మిచౌంగ్ బాధితులకు రూ.442 కోట్లు సాయం చేయనుంది. ఈసీ ఆంక్షలు సడలించడంతో ఇప్పటికే ఆసరా, విద్యా దీవెన నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే.