ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా..

న్యూఢిల్లీ, జనవరి 15: ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు (Gidugu Rudraraju) రాజీనామా చేశారు. సోమవారం పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రుద్రరాజు…

ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు (Gidugu Rudraraju) రాజీనామా చేశారు. సోమవారం పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రుద్రరాజు… రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు (AICC Chief Mallikarjuna Kharge) అందజేశారు. ఒకటి, రెండు రోజుల్లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల రెడ్డి (YS Sharmila Reddy) పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది. నిన్న (ఆదివారం) మణిపూర్‌లో పీసీసీ అధ్యక్ష పదవిపై షర్మిలకు ఖర్గే స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైకమాండ్ ఆదేశం మేరకు పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు.