కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల..!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్‌
షర్మిలకు పార్టీ బాధ్యత అప్పగించినట్లు సమాచారం..
షర్మిల నియామకంపై నేడు ప్రకటన వెలువడే జరిగింది…
షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరితే ఏపీలో కాంగ్రె్‌సతో పాటు ఆమె భవితవ్యం కూడా బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు సమచారం… కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలతో షర్మిల పూర్తి స్థాయిలో చర్చలు జరిపినా తరువాత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది…

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అక్కడ కీలక నిర్ణయం తీసుకుంది. అంతా ఊహించినట్లుగానే దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా నియమించింది. కొద్దిరోజుల కిందటే ఈమె పార్టీలో చేరడం గమనార్హం. ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీల సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు..

ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న గిడుగు రుద్ర రాజును రాజీనామా చేయాలని కోరగా.. ఆయన సోమవారం మధ్యాహ్నం తప్పుకున్నారు. తన రాజీనామా లేఖను ఖర్గేకు పంపించారు. రుద్ర రాజు తప్పుకున్న గంటల వ్యవధిలోనే ఇప్పుడు షర్మిలను ఆ స్థానంలో నియమించడం విశేషం..