మరోసారి సీఎంగా జగన్ అవుతారని స్పష్టం చేసింది మరో సర్వే…!!

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేశారు. నవరత్నాల పేరు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారు.. అనే అభిప్రాయం ప్రజలో ఉన్నట్లు వైఎస్సార్సీపీ నేతలు అంటున్న మాటలు… ముఖ్యంగా విద్యా, వైద్యరంగంలో తనదైన మార్క్ ను చూపించారు సీఎం జగన్. మరోవైపు ఎన్నికల సమరంలో సీఎం జగన్ దూసుకెళ్తున్నారు. టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ వచ్చి చేరడంతో ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఎవరు అధికారంలోకి వస్తారనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో సర్వేల హడావుడి మొదలైంది. టీడీపీ, జనసేన బీజేపీతో పొత్తు ప్రకటించిన తరువాత ఏపీలో తాజాగా జన్ మత్ పోల్స్ సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మరోసారి సీఎంగా జగన్ అవుతారని స్పష్టం చేసింది. మరి.. వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఏపీలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది అన్ని ప్రధాన పార్టీలు స్పీడు పెంచాయి. అధికార వైసీపీ..175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేనలు, బీజేపీతో జతకట్టాయి. ఈమూడు పార్టీలు కూటమిగా, వైఎస్సార్ సీపీ సింగిల్ గా 2024 ఎన్నికల బరిలో దిగనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీకి సంబంధించి జన్ మత్ పోల్స్ సంస్థ సర్వే వివరాలు బయటకు వచ్చాయి. అందులో భారీ మెజార్టీతో సీఎం జగన్ కే మరోసారి ప్రజలు అధికారం ఇస్తారని తేలింది.

రెండు రోజుల క్రితం లోక్ సభ స్థానాలపై జన్ మత్ పోల్స్ సంస్థ సర్వే నిర్వహించింది. దేశం వ్యాప్తంగా పార్లమెంట్ మూడ్ ఆఫ్ ది నేషన్ ను జన్ మత్ పోల్ అంచనా వేసింది. జన్ మత్ పోల్స్ చేసిన సర్వే ప్రకారం…కేంద్రంలో మూడో సారి బీజేపీ అధికారంలోకి రానుంది. 326 నుంచి 328 స్థానాలను బీజేపీ ఖాతాలోకి రాబోతున్నాయని తెలిపింది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి 43 నుంచి 45 స్థానాలు వస్తాయని తేల్చింది. అదే విధంగా ఏపీ విషయానికి వస్తే.. అధికార వైఎస్సార్ సీపీ 19 నుంచి 20, టీడీపీ 3 నుంచి 4 లోక్ సభ స్థానాలను గెల్చుకుంటుందని అంచనా వేసింది. అలానే బెంగాల్ రాష్ట్రానికి చెందిన తృణమూల్ కాంగ్రెస్ కి 21-23 , ఆప్ కి 7-8 అని బీజేడికి 10-11 స్థానాలు గెలుస్తుందని అంచనా వేసింది.

అదే విధంగా జన్ మత్ పోల్ ఏపీ అసెంబ్లీకి సంబంధించి కూడా సర్వే విడుదల చేసింది. టీడీపీ,జనసేన, బీజేపీ కలిసిన తరువాత తొలిసారి జన్ మత్ పోల్ తన సర్వేను విడుదల చేసింది. గతంలో టీడీపీ, జనసేన కూటమి ఉన్నప్పుడు, విడిగా ఉన్నప్పుడు జన్ మత్ పోల్స్ అనేక సర్వేలు నిర్వహించి ఎవరికెన్ని సీట్లు వస్తాయని అంచనా వేసింది. అదే విధంగా తాజాగా బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో మరోసారి జన్ మత్ పోల్స్ తన సర్వేను విడుదల చేసింది.

ఇందులో వైఎస్సార్ సీపీ 119 నుంచి 120 స్థానాలు , విపక్ష కూటమికి 49నుంచి 51 అసెంబ్లీ స్థానాలు గెలిచే అవకాశం ఉందని ఆ సంస్థ అంచనా వేసింది. మొత్తంగా జన్ మత్ పోల్ చేసిన సర్వే ప్రకారం.. వరుసగా రెండో సారి వైఎస్సార్ సీపీ అధికారంలోకి రానుంది. అలానే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి సీఎంగా కానున్నారని జన్ మత్ పోల్ సర్వే అంచనా వేసింది. మొత్తంగా జగన్‌ ప్రభుత్వంపై ప్రజల్లో పెద్దగా అసంతృప్తి లేదని ఈ సర్వే అభిప్రాయపడింది. ఈ జన్ మత్ సర్వే.. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. మరి..