ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు చేపట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమం విజయవంతం…ఉద్యోగ సంఘాలు..

R9TELUGUNEWS.COM ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు చేపట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమం విజయవంతం అయ్యిందని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు భారీగా తరలివచ్చారని పేర్కొన్నాయి. దివ్యాంగ ఉద్యోగులు, పొరుగుసేవల సిబ్బంది కూడా హాజరయ్యారని వెల్లడించాయి. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఎల్లుండి(ఫిబ్రవరి 5వ తేదీ) పెన్‌డౌన్‌ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపాయి. ఇదివరకు ప్రకటించిన విధంగానే ఈనెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.