ఏపీ నుంచి ప్రత్యేక బస్సులు.

దసరా సెలవుల తర్వాత తిరుగు ప్రయాణమయ్యే వారికోసం ఏపీఎస్‌ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. జిల్లాల వారీగా ప్రత్యేక బస్సులను సిద్ధం చేసింది. హైదరాబాద్‌కు ఆదివారం అదనంగా 150 ప్రత్యేక సర్వీసులను అందుబాటులో ఉంచింది. వీటికి ఆన్‌లైన్‌ టికెట్‌ రిజర్వేషన్‌ కూడా ప్రారంభించింది. అత్యధిక రద్దీ ఆదివారమే ఉంటుందని అధికారుల అంచనా. ఇక ఒకటి, రెండు జిల్లాల మధ్య ప్రయాణించే వారితో సోమవారం తెల్లవారుజాము నుంచి రద్దీ ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం నుంచి అంతర జిల్లాల సర్వీసులు అదనంగా నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం మధ్యాహ్నం తర్వాత నుంచి ప్రయాణికుల రద్దీ, ఆన్‌లైన్‌ టికెట్ల రిజర్వేషన్‌ సరళిని బట్టి.. ఆయా మార్గాల్లో సర్వీసులు పెంచుతామని ఆర్టీసీ ఈడీ (ఆపరేషన్స్‌) బ్రహ్మానందరెడ్డి తెలిపారు.