ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్….మే 9 నుంచి వేసవి సెలవులు….

ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్ అందింది. రాష్ట్రంలోని విద్యార్థులకు మే 9 నుంచి వేసవి సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. కరోనా కారణంగా రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఏడాది ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను ఈనెల 27 నుంచి మే 9 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు పూర్తవగానే సమ్మర్ హాలీడేస్ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు…ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు సమ్మేటివ్-2 పరీక్షలను ఏప్రిల్ 22 నుంచి మే 4 వరకు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఎగ్జామ్స్ పూర్తి కాగానే వారికి సెలవులు ప్రకటించనున్నారు. వేసవి సెలవుల అనంతరం జులై 4 నుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభించాలని జగన్ సర్కారు యోచిస్తోంది. మరోవైపు ఏపీలోని జూనియర్‌ కాలేజీలకు మే 25 నుంచి జూన్‌ 20 వరకు సమ్మర్‌ హాలిడేస్‌ ఇవ్వాలని విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది…