రేపే ఏపీ 10వ తరగతి ఫలితాలు..ఉదయం 11 గంటలకు రిలీజ్…

శనివారం ఉదయం 11 గంటలకు విజయవాడలో పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్‌ ఫలితాలను విడుదల చేస్తారని అధికారులు పేర్కొన్నారు. రికార్డ్ స్థాయిలో 25 రోజుల్లోనే రిజల్ట్స్ ఇస్తున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. కాగా ఫలితాల తర్వాత విద్యాసంస్థలు ర్యాంకులను ప్రకటనల రూపంలో ఇవ్వొద్దని ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే.. జైలు శిక్ష విధిస్తామని పేర్కొంది.

కాగా, కరోనా మహమ్మారి కారణంగా 2 ఏళ్లపాటు టెన్త్ ఎగ్జామ్స్ జరగలేదు. 2019 తర్వాత తొలిసారి స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్‌ 27 నుంచి మే 9వరకు టెన్త్ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించింది. కాగా, ఇందులో మొత్తం 6,21,799 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3,776 కేంద్రాల్లో ఎగ్జామ్స్ నిర్వహించారు…