ఏపీలొ విద్యార్థులకు ఊరట కల్పిస్తూ నిర్ణయం..!!!

విద్యార్థులకు ఊరట కల్పిస్తూ నిర్ణయం.

జులై 6 నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనుండగా.. విద్యార్థులకు ప్రభుత్వం ఊరట కల్గించింది. సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులు ఎన్ని మార్కులు సాధించినా వారిని కంపార్ట్మెంటల్ పాస్ కింద కాకుండా, విద్యార్థులు సాధించే మార్కులను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. సర్టిఫికెట్లలో రెగ్యులర్ పరీక్షల్లో పాస్ అయినట్లే చూపిస్తారు. సప్లిమెంటరీ పాస్ అని చూపించరు. ఈ ఒక్క ఏడాది మాత్రమే ఈ ఛాన్స్ ఇచ్చారని సమాచారం..