టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా..

విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన శాసనసభ సభ్యత్వానికి రాజీమానా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌కు పంపారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్రం 100 శాతం ప్రైవేట్‌పరం చేస్తున్నట్లు ప్రకటించడాన్ని నిరసిస్తూ రాజీనామా చేస్తున్నట్లు లేఖలో ఆయన పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసమే తాను రాజీనామా చేస్తున్నానని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణం వెనక్కి తీసుకోవాలని డియాండ్‌ చేశారు. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల ఆత్మ గౌరవం.. విశాఖ ప్రజల గుండె తప్పుడు… విశాఖ నగరం పేరే ఉక్కు నగరం. కేంద్ర ప్రభుత్వం ఆదాయ వనరుల కోసం ఇతర ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని కోరారు. అలా కాదని ముందుకెళ్తే ఢిల్లీ లో జరుగుతోన్న రైతు ఉద్యమం కంటే 100 రేట్ల పెద్ద ఉద్యమాన్ని, తీవ్రతని చవిచూడాల్సి ఉంటుంది’ అని గంటా ట్వీట్‌ చేశారు.