అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో తీవ్ర ఉధ్రిక్తత నెలకొంది.

అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో తీవ్ర ఉధ్రిక్తత నెలకొంది. వైసీపీ అభ్యర్ధిని నామినేషన్ వేయకుండా అచ్చెన్నాయుడు సోదరుడు హరివరప్రసాద్ , టీడీపీ వర్గీయులు అడ్డుకున్నట్టు చెబుతున్నారు. అయితే వైసీపీ అభ్యర్ధి కింజరాపు అప్పన్నతో టెక్కలికి చెందిన దువ్వాడ శ్రీనివాస్ రావడంతో టీడీపీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దువ్వాడతో సహా నామినేషన్ వేసే అభ్యర్ధిని నామినేషన్ కేంద్రంలోకి రాకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నట్టు చెబుతున్నారు. దీంతో పోలీసులు , టీడీపీ వర్గీయుల మధ్య తోపులాట జరిగినట్టు తెలుస్తోంది. నామినేషన్ల చివరిరోజు కావడంతో అంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. కోటబొమ్మాళి మండలం నిమ్మాడ పంచాయతీలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థి కింజరాపు అప్పన్నకు అచ్చెన్నాయుడు ఫోన్ చేసినట్టు చెబుతున్నారు. పోటీ నుంచి తప్పుకోవాలంటూ ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది. అయితే వైసీపీ తరపు అభ్యర్ధి అప్పన్ననామినేషన్ వేయడానికి దువ్వాడ శ్రీనుని కూడా పిలిపించుకోవడంతో సంచలంగా మారింది. నామినేషన్ వేయకుండా తన ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారంటూ టెక్కలి వైసీపీ ఇంచార్జ్ దువ్వాడ శ్రీనివాస్ ను ఆశ్రయించడంతోనే ఆయన వచ్చాడని అంటున్నారు.