ఏపీ,తెలంగాణకు కొత్త జడ్జీలు…

ఏపీ,తెలంగాణకు కొత్త జడ్జీలు.

దేశవ్యాప్తంగా 15 మంది న్యాయమూర్తులను బదిలీ చేసేందుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీంతో తెలంగాణకు ఒకరు, ఏపీకి ఇద్దరు న్యాయమూర్తులు బదిలీ కానున్నారు. బాంబే హైకోర్టు నుంచి ఉజ్జల్ భుయాన్ తెలంగాణ హైకోర్టుకు బదిలీ అవనున్నారు. పాట్నా హైకోర్టు నుంచి అహ్సానుద్దీన్ అమానుల్లాతో పాటు అలహాబాద్ హైకోర్టు నుంచి న్యాయమూర్తి రవినాథ్ తిల్హారి ఏపీ హైకోర్టుకు బదిలీ కానున్నారు.