ఏపీ, తెలంగాణ సరిహద్దులో నిలిచిపోయిన ధాన్యం లారీలు..!!!.

తెలంగాణ-ఏపీ సరిహద్దులో ధాన్యం లారీలు నిలిచిపోయాయి. ధాన్యం లారీలను తెలంగాణలోకి అనుమతించకపోవడంతో సరిహద్దులో భారీగా లారీలు ఆగిపోయాయి.
పల్నాడు జిల్లా దాచేపల్లి చెక్‌పోస్టు వద్ద ఏపీ లారీలను తెలంగాణ అధికారులు అడ్డుకున్నారు. తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యం సేకరిస్తోంది.ఈ నేపథ్యంలో ఏపీ నుంచి వచ్చే ధాన్యం లారీలను అడ్డుకున్నారు. ముందస్తు సమాచారం లేకపోవడంతో డ్రైవర్లు పడిగాపులు పడుతున్నారు. తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం లారీలు రాష్ట్రంలోకి ప్రవేశించడానికి వీలులేకుండా 51 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని మంత్రి గంగుల కమలాకర్‌, ఉన్నతాధికారులు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.