కృష్ణా నదిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మత్స్యకారుల మధ్య ఘర్షణ….!!

గత కొంత కాలం నుండి ఆంధ్ర తెలంగాణల మధ్య ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది… గతంలో ఏపీ తెలంగాణ మధ్య విద్యుత్ విషయములో, నీటి విషయములో వివాదం మొదలైంది…. కాని ఈసారి అనిటికంటే భిన్నంగా కృష్ణా నదిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మత్స్యకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రెండు రాష్ట్రాలకు చెందిన మత్స్యకారులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు….నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రింగ్ వలలు వినియోగానికి సంబంధించి తెలంగాణ, ఏపీ మత్స్యకారుల మధ్య కొంతకాలంగా వివాదం చోటుచేసుకుంది. రింగ్ వలల వివాదానికి సంబంధించి అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందని సమాచారం. ఈ క్రమంలోనే నేడు మాటమాట పెరిగి ఇరు రాష్ట్రాల మత్స్యకారులు ఘర్షణకు దిగారు.

ఈ క్రమంలోనే ఏపీ మత్స్యకారులను తెలంగాణ మత్స్యకారులు చందంపేటకు తీసుకుని వచ్చారు. ఇదే విషయాన్ని ఏపీ మత్స్యకారులు తమవారికి తెలియజేశారు. ఆ తర్వాత దీనిపై సమాచాంర అందుకున్న ఏపీ పోలీసులు చందంపేటకు వచ్చి ఆ రాష్ట్ర మత్స్యకారులను విడిపించి తీసుకెళ్లారు. అయితే రింగ్ వలలు వేయకుండా చూడాలని నల్గొండ జిల్లా మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ..