సీఎం వైఎస్‌ జగన్‌ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం…..!!!

సీఎం వైఎస్‌ జగన్‌ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం…

గన్నవరం నుంచి ఢిల్లీ బయల్దేరిన కొద్ది సేపటికే విమానంలో సాంకేతిక సమస్య…

తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్‌…

ఇవాళ రాత్రికే ఢిల్లీకి సీఎం వైఎస్‌ జగన్‌…

రాత్రి 9 గంటలకు మరో ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం….

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ప్రమాదం తప్పింది. సీఎం జగన్‌ సోమవారం సాయంత్రం ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో సీఎం జగన్‌ ఢిల్లీకి బయలుదేరగా.. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో కాసేపటికే సాంకేతిక లోపం ఉన్నట్టుగా గుర్తించిన విమాన సిబ్బంది.. వెంటనే గన్నవరం ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు. రేపు ఢిల్లీలో జరిగే గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ సాయంత్రం 5:03 గంటలకు బయలుదేరారు. కాసేపటికే పైలట్‌ విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించారు. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు. తిరిగి సాయంత్రం 5:27 గంటలకు గన్నవరంలో ల్యాండ్‌ అయ్యారు. సీఎం తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు