టిప్పర్ డ్రైవర్ కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన సీఎం జగన్…

వైరల్ అవుతున్న శింగనమల వైసీపీ అభ్యర్థి విడియో

ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు చేసే ఫీట్లు అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తుంటాయి. శింగనమల వైసిపి అభ్యర్థి వీరాంజనేయులు డప్పు వాయించిన విడియో సామాజిక

సామాన్యులు రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి ఉందా అంటే లేదనే సమాధానం వస్తోంది. విలువులతో కూడిన రాజకీయం చూడాలంటే ఈ రోజుల్లో కాస్తా కష్టమే అని చెప్పాలి. డబ్బుతో కూడిన రాజకీయాలే నేటితరంలో ఎక్కువుగా కనిపిస్తోంది. గ్రామ సర్పంచ్‌గా పోటీ చేయాలంటనే లక్షలు ఖర్చు చేయాలి. మరీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఓ సామాన్యుడు ఎమ్మెల్యేగా పోటీ చేయడమంటే అది కలే..నియోజకవర్గంలో జోన్నలగడ్డ పద్మవతి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమెను కాదని వీరాంజనేయులుకు టికెట్ ఇవ్వడంపై పార్టీ నాయకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నియోజకవర్గంలో చాలామంది పేరున్న నాయకులు ఉన్నప్పటికి వారిని దాటుకుని వీరాంజనేయులుకు ఎలా టికెట్ దక్కిందో ఎవరికి అర్థం కావడం లేదు. టిప్పర్ డ్రైవర్‌గా పని చేస్తూ తన కుటుంబాన్ని చూసుకుంటున్నారు వీరాంజనేయులు. స్థానికంగా వీరాంజనేయులుకు మంచి గుర్తింపు ఉంది.

వీరాంజనేయులు 2014 ఎంఎడ్‌ను పూర్తి చేశారు. అనంతరం ప్రజలకు సేవ చేయాలనే కోరికతో రాజకీయాల్లోకి వచ్చారు. తన తండ్రి కూడా గతంలో సర్పంచ్‌గా పని చేశారు. ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వీరాంజనేయులకు ఎటువంటి ఆస్తులు లేవు. వైఎస్సార్‌‌సీపీకి వీర విధేయుడిగా, పార్టీనే నమ్మకుని పని చేస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో పార్టీ కార్యక్రమాలను వీరాంజనేయులు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు.

నిజానికి ఆయన అండర్ డాగ్ గా బరిలోకి దిగారు. పెద్దగా ఎవరికీ పరిచయం లేని, ఒక టిప్పర్ డ్రైవర్ అయిన వీరాంజనేయులును సీఎం జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థిగా ప్రకటించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే వీరాంజనేయులు సుడిగాలి ప్రచారం చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ప్రచారంలో ఆయన పై చేయిలో ఉన్నారని సమాచారం.