ఆప్ లో టీజేఎస్ విలీనం వార్తలపై ప్రొఫెసర్ కోదండరామ్ తీవ్రంగా స్పందించారు….

ఆప్ లో టీజేఎస్ విలీనం చేయను: కోదండరామ్

ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్)లో టీజేఎస్ ను విలీనం చేస్తున్నట్టు వస్తున్న వార్తలపై ప్రొఫెసర్ కోదండరామ్ తీవ్రంగా స్పందించారు. ఆప్ లో టీజేఎస్ ను విలీనం చేసే ప్రశ్నే లేదన్నారు.కేసీఆర్‌తో తప్ప బావస్వారుప్యత ఉన్న పార్టీలతో కలిసి పోరాడుతామని స్పష్టం చేశారు. పవన్‌కల్యాణ్ తెలంగాణకు అడ్డం పడిన వ్యక్తి కాదని కోదండరామ్ అన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన షర్మిలను కలుపుకుని పోమని కూడా ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో విలీనం.. పొత్తు బయట ప్రచారం మాత్రమేనని అన్నారు.తెలంగాణలో కేసీఆర్ అడ్డుగోలు పాలనతో విద్యుత్‌శాఖ సంక్షోభంలో పడిందన్నారు. విద్యుత్ రంగ పరిస్థితిపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. ధాన్యం సేకరణపై కేంద్రంతో సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు………….

అంతకుముందు ప్రొఫెసర్ కోదండరామ్ పట్ల తెలంగాణ ప్రజల్లో ఆదరణ ఉన్నప్పటికీ టీజేఎస్ సొంతగా ఓట్లు, సీట్లు సాధించలేని స్థితిలో ఉంది కాబట్టి ఏదైనా జాతీయ పార్టీలో విలీనం ద్వారా లబ్దిపొందొచ్చని నేతలు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. సైద్ధాంతికంగా బీజేపీతో కలవలేమని, కాంగ్రెస్ పరిస్థితే బాగోలేదు కాబట్టి ఆ రెండు జాతీయ పార్టీలతో కలవడానికి కోదండరామ్ సిద్ధంగా లేరని వెల్లడైంది. అయితే తెలంగాణలో తృతీయ ప్రత్యామ్నాయంగా టీజేఎస్ నిలవగలదని, ఆ దిశగా ఆమ్ ఆద్మీ పార్టీలో విలీనం చేస్తే బాగుంటుందనీ నేతలు సూచిస్తున్నట్లు తెలుస్తోంది….దానికి దీటుగా నేడు వారు తీవ్ర స్థాయిలో స్పందించి.. రాజకీయపరంగా ఎవరితోనైనా పొత్తు ఉండొచ్చేమో కానీ విలీనం అనే మాట మాత్రం ఉండదని తెలిపారు..