ఏప్రిల్‌లో కొత్త పింఛన్లు..మంత్రి కేటీఆర్‌..

వర్షాలు పడితే మూసీ నదికి వరదలు వచ్చి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలంగాణ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. అందుకోసమే ప్రతి వర్షపు చుక్క మూసీలోకి వెళ్లేలా నాలాల అభివృద్ధి చేపట్టామన్నారు. దీనికోసం ₹900 కోట్లకు పైగా కేటాయించామని తెలిపారు. ₹3,866 కోట్లతో ఎస్టీపీలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఏప్రిల్‌లో లబ్ధిదారులకు కొత్త పింఛన్లు అందజేస్తామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.