అర్జున అవార్డ్ అందుకున్న ఏకైక క్రికెటర్..

*Arjuna Awards 2023:

*అంతర్జాతీయ వేదికలపై క్రీడల రంగంలో అత్యుత్తమ విజయాలు సాధించినందుకు, భారత ఆటగాళ్లకు భారత ప్రభుత్వ ప్రతి ఏటా అర్జున అవార్డును అందజేస్తున విషయం తెలిసిందే.*

2023లో తమ అత్యుత్తమ క్రీడ స్సూర్తిని కనబరిచిన 25 మంది ఆటగాళ్లకు అర్జున అవార్డుని అందించారు. ఈ జాతీయ క్రీడ పురస్కారాలు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అందిస్తుంటారు. ఇందులో క్రికెట్ క్రీడా నుంచి కేవలం ఒక్కరు మాత్రమే ఈ అవార్డు అందుకోవడం విశేషం. టీమ్ ఇండియా బౌలర్ మహ్మద్ షమీ ఈ అర్జున అవార్డును రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. 25 మందిలో అర్జున అవార్డు అందుకున్న ఏకైక క్రికెటర్‌గా షమీ నిలిచారు.