ఆర్కేబీచ్ లో వివాహిత మిస్సింగ్….గాలింపు కోసం రూ.కోటి ఖర్చు దండగా..!!.ప్రియ…ప్రియుడితో జంప్..!! అసలు కథ ఏంటో మీరే చూడండి..

ఆర్కేబీచ్ లో వివాహిత మిస్సింగ్..

ప్రియ…ప్రియుడితో జంప్…
వైజాగ్ టూ నెల్లూరు..వివాహిత మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్‌…సాయి ప్రియ ఏం చేసిందో తెలిస్తే.. అందరికీ మారిపోతుంది… … గాలింపు కోసం రూ.కోటి ఖర్చు దండగా ..

సంచలనంగా మారిన వివాహిత మిస్సింగ్.. సముద్రంలో కొట్టుకుపోయిందని, భర్త పైనే అనుమానాలు అంటూ కూడా వివాహిత బంధువులు పెద్ద పంచాయతీని సృష్టించారు.. కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది..
ఆర్కే బీచ్‌లో తప్పిపోయిన వివాహిత సాయి ప్రియ మిస్సింగ్ కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. 36 గంటలుగా ఆమె కోసం గాలింపు చేపడుతోన్న అధికారులకు దిమ్మతిరిగే వాస్తవాలు తెలిశాయి. సముద్రంలో గల్లంతైందని అందరూ భావిస్తుండగా సాయి ప్రియ నెల్లూరులో ప్రత్యక్షమైంది. సాయి ప్రియ నెల్లూరులో ఉన్నట్లు ఆమె బంధువులు గుర్తించారు. ప్రేమిడికుడితో కలిసి పారిపోయినట్లు గుర్తించారు. శ్రీనివాస్‌తో వివాహానికి కంటే ముందు.. సాయి ప్రియ నెల్లూరుకి చెందిన రవి అనే వ్యక్తితో ప్రేమలో ఉందని సమాచారం. వివాహానికి ముందు రెండు సార్లు రవితో కలిసి సాయి ప్రియ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు శ్రీనివాస్‌ను 2020 జూలై 25న పెళ్లి చేసుకుంది.

శ్రీనివాస్‌ హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తుండడంతో ఈ జంట హైదరాబాద్‌లో కాపురం పెట్టింది. అయితే పెళ్లి తర్వాత కూడా సాయి పల్లవి రవితో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించింది. నాలుగు నెలల క్రితం కంప్యూటర్ కోర్సు చేయాలంటూ సాయి ప్రియ హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చింది. ఇదే సమయంలో సెకండ్ మ్యారేజ్‌ డే అని శ్రీనివాస్‌ ఈనెల 25న హైదరాబాద్‌ నుంచి విశాఖ వచ్చాడు. అదే రోజు సాయంత్రం 5.30కి భర్తతో కలిసి బీచ్‌కి వెళ్లిన సాయి ప్రియ, అంతకు ముందే ఆ సమాచారాన్ని ప్రియుడు రవికి చేరవేసింది. శ్రీనివాస్‌ ఏమరపాటుగా ఉన్న సమయంలో రవితో కలిసి సాయి ప్రియ అక్కడి నుంచి పారిపోయింది. ఇది తెలియని శ్రీనివాస్‌ తన భార్య తప్పిపోయిందని తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఏకంగా హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టారు.

*గాలింపు కోసం రూ.కోటి ఖర్చు.. వృధా..

ఇదిలా ఉంటే సాయి ప్రియ గాలింపు కోసం అధికారులు సుమారు రూ.కోటి ఖర్చు చేశారు. ఈ విషయమై విశాఖ నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌ మాట్లాడుతూ వివాహిత ఆచూకీ కోసం ప్రభుత్వ శాఖలన్నీ తీవ్రంగా శ్రమించాయని తెలిపారు. ప్రస్తుతం సాయి ప్రియ నెల్లూరులో ఉన్నట్లు సమాచారం వచ్చిందని, ఆమెను నెల్లూరు నుంచి విశాఖకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు.