అర్మేనియాకు పినాక మల్టీ బారెల్ రాకెట్ లాంచర్ క్షిపణులను ఎగుమతి చేస్తున్న భారత్..

అర్మేనియా స్వదేశీయంగా ఉత్పత్తి చేసిన పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ల తో సహా క్షిపణులు రాకెట్లు మరియు మందు గుండి సామాగ్రిని ఎగుమతి చేయడానికి భారతదేశం ఒక ఒప్పందంపై సంతకం చేసింది.
దాని పొరుగు దేశం అజర్బైజాన్ సైనికులతో ఇటీవల జరిగిన ఘర్షణల దృష్ట్యా అర్మేనియా భారత్ నుండి ఈ ఆయుధాలను దిగుమతి చేసుకుంటూ ఉన్నది.
ఈ నెల మొదట్లో అర్మేనియా మరియు భారత్ రెండు దేశాలు ఒప్పందాల పైన సంతకాలు చేసుకున్నాయి.
ఈ ఒప్పందము ప్రకారము రాబోయే కొద్ది రోజులలో విలువైన ఆయుధాలను సరఫరా చేస్తుంది.

మొన్నటి వరకు తుపాకీ గుండును కూడా విదేశాల నుండి దిగుమతి చేసుకున్న భారతదేశము ఈరోజు తన అవసరాలకు కావలసిన ఆయుధాలను క్షిపణులను యుద్ధవిమానాలను స్వదేశీయంగా తయారు చేసుకొని మరియు ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో ఎదిగి ఈరోజు అగ్రదేశాలకు పోటీగా ఆయుధ ఎగుమతి పోటీలో నిలిచినది.
ఎంతగా అంటే ఈరోజు అమెరికా దేశానికే మన తేజస్ విమానాలు ఎగుమతి చేసే విధంగా తయారు అయ్యింది భారత్.